: విరాట్ మ్యాచ్ కు అనుష్క...వరల్డ్ కప్ సెమీస్ ఫలితం పునరావృతమవుతుందా?
ఐపీఎల్ సీజన్-7లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి మ్యాచ్ ను కోల్ కతాతో ఈడెన్ గార్డెన్స్ లో ఆడుతోంది. ప్రియుడు ఆడుతున్న సీజన్-8 తొలి మ్యాచ్ ను చూసేందుకు బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఈడెన్ గార్డెన్స్ కు వచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. 'అనుష్క వచ్చిందిగా, బెంగళూరు ఓటమి ఖాయం' అంటూ నెటిజన్లు జోస్యం చెబుతున్నారు. వరల్డ్ కప్ లో అప్రతిహతంగా సాగుతున్న టీమిండియా ప్రయాణంలో సెమీస్ కు ఒక్క రోజు ముందు ఆస్ట్రేలియా చేరుకున్న అనుష్క శర్మ ప్రియుడు కోహ్లీతో షికార్లు కొట్టి డిన్నర్ చేసింది. మర్నాడు కోహ్లీ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. నెటిజన్ల ఛలోక్తుల నేపథ్యంలో ఈ మ్యాచ్ ఏమవుతుందో చూడాలి.