: తెలంగాణలో రానున్న రెండేళ్లలోను ఉద్యోగాల జాతరే: కేటీఆర్
తెలంగాణలో వచ్చే రెండేళ్లలోను ఉద్యోగాల జాతరేనని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్సీపీఎస్సీ లోగో ఆవిష్కరణ సభలో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఆరంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రానున్న రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్షా 7 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. 'తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, ఉద్యోగాల ట్యాగ్ పై' అని ఆయన చెప్పారు. టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేపడతామని ఆయన వెల్లడించారు. లోగోను అద్భుతంగా తీర్చిదిద్దిన టీఎస్సీపీఎస్సీ సభ్యులకు అభినందనలని ఆయన పేర్కొన్నారు.