: బద్ధ శత్రువులు ఎదురుపడ్డారు...తొందర్లో కలిసిపోనున్నారు!
అమెరికాకు ఒకప్పుడు క్యూబా బద్ధ శత్రువు. అమెరికాకు పక్కలో బల్లెంలా మెలిగింది. అలాంటి క్యూబా నెమ్మదిగా కలిసిపోతున్నట్టు కనిపిస్తోంది. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడేల్ క్యాస్ట్రో అధికారంలో ఉండగా, అమెరికాతో బద్ధవైరం కొనసాగించింది. అమెరికా అధ్యక్షుడు ఏదైనా కార్యక్రమానికి హాజరైతే క్యూబా అధినేత హాజరయ్యేవాడు కాదు. అలాగే అమెరికా కూడా ప్రవర్తించింది. తాజాగా, పనామా సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ నవ్వుతూ పలకరించుకుని, కరచాలనం చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సన్నివేశంతో రెండు దేశాలు సంబంధాలు పునరుద్ధరించుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దౌత్య సంబంధాలపై ఒబామా, క్యాస్ట్రో నేటి సాయంత్రం చర్చించనున్నారు.