: పోలీసు అధికారులు చనిపోతే ఎంఐఎం నేతలు ఎందుకు మాట్లాడలేదు?: వెంకయ్యనాయుడు


వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్ కౌంటర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సీబీఐ విచారణ చేయించాలంటున్న ఎంఐఎం నేతల డిమాండ్ పై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. ఉగ్రవాదుల పక్షాన ఎంఐఎం నేతలు మాట్లాడటం సరికాదన్నారు. అదే సూర్యాపేట, అంతకుముందు జరిగిన కాల్పుల్లో పోలీసు అధికారులు చనిపోతే వారెందుకు మాట్లాడలేదని వెంకయ్య మీడియా సాక్షిగా ప్రశ్నించారు. ఇక సామాన్యులు చనిపోతే స్పందించని హక్కుల నేతలు ఉగ్రవాదులు చనిపోతే స్పందించడం విచారకరమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ఎన్ కౌంటర్లపై కేంద్రం జోక్యం చేసుకోదని, శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని స్పష్టం చేశారు. తీవ్రవాది జకీర్ రెహ్మాన్ లఖ్వీ విడుదలను కేంద్రం తీవ్రంగా వ్యతిరేకించిందన్న ఆయన, అయినా విడుదల చేయడం దురదృష్టకరమని చెప్పారు.

  • Loading...

More Telugu News