: బలూచిస్తాన్ లో నిద్రిస్తున్న కూలీలపై ఉగ్ర దాడి... 20 మంది మృతి


పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ లో నిద్రిస్తున్న కూలీలపై గత రాత్రి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ సమయంలో 20 మంది కూలీలు మరణించారు. స్థానిక తర్బత్ లో సోహ్రాబ్ డ్యామ్ నిర్మాణ పనులకోసం ఆ కూలీలు వచ్చినట్టు సీనియర్ పోలీసు అధికారి తారిక్ ఖిల్జీ తెలిపారు. చనిపోయిన వారిలో 16 మంది పంజాబ్ కు, నలుగురు సింధ్ ప్రావిన్స్ కు చెందినవారని చెప్పారు. అంతకుముందు ఈ ఘటనను బలుచిస్తాన్ ప్రావిన్స్ లోని అక్బర్ హుస్సేన్ దురానీ ధ్రువీకరించారు.

  • Loading...

More Telugu News