: సీఎం చంద్రబాబు, లోకేష్ పై రఘువీరా ధ్వజం


ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ కార్యకర్తల నిధి సమన్వయకర్త నారా లోకేష్ పై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పరిశ్రమల సబ్సిడీలో పెద్ద, చిన్న బాస్ లకు భారీగా ముడుపులు అందాయని ఆరోపించారు. దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇసుక మాఫియాలో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలున్నారని... వారిపై మీ వైఖరేంటని రఘువీరా ప్రశ్నించారు. కూలీలను ఎన్ కౌంటర్ చేసినట్టు వారిని కూడా ఎన్ కౌంటర్ చేస్తారా? అని నిలదీశారు. హుదుద్ తుపాన్ బియ్యాన్ని పచ్చపార్టీ నేతలు పందికొక్కుల్లా బొక్కారని వ్యాఖ్యానించారు. ఇక తనపై ఆరోపణలు ఉంటే సీబీఐ విచారణ జరిపించాలన్న రఘువీరా, తాము ఊర కుక్కలం కాదని కాపలా కుక్కలమని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News