: సికింద్రాబాద్- కాకినాడ ఎక్స్ ప్రెస్ లో బంగారం చోరీ
సికింద్రాబాద్- కాకినాడ గౌతమి ఎక్స్ ప్రెస్ లో బంగారం చోరీ జరిగింది. ఈ రైలు విజయవాడ సమీపంలోని రాయనపాడుకు చేరుకునే సమయంలో ప్రయాణికుల నుంచి రూ.లక్ష విలువైన బంగారాన్ని దుండగులు దోచుకుని ఉడాయించారు. వెంటనే దగ్గరలోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధితులు వాపోతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.