: ఈ నెల 12 నుంచి చంద్రబాబు చైనా పర్యటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12 నుంచి చైనాలో పర్యటించనున్నారు. ఈ అర్ధరాత్రి (అంటే తెల్లవారితే ఆదివారం) సీఎం హైదరాబాదు నుంచి బీజింగ్ బయలుదేరతారు. ఈ నెల 17 వరకు పర్యటన కొనసాగుతుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా బాబు పర్యటన జరగనుంది. ఈ నేపథ్యంలో బీజింగ్, చెంగ్డూ, షాంగైల్లో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అవడంతో బాటు, పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్యకార్యదర్శి సతీష్ చంద్ర, పలువురు ప్రభుత్వ అధికారులు బృందంగా వెళ్లనున్నారు.