: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి చిరుద్యోగి రూ.8 లక్షల భూరి విరాళం!
ఏజీ ఆఫీస్ లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పూడి రమేశ్ చేసేది చిన్న ఉద్యోగమే. అయితేనేం, దాతృత్వంలో మాత్రం ఆయన మనసు పెద్దదే. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని లేక ఏపీ ప్రభుత్వం పడుతున్న నానా ఇబ్బందులకు ఆయన చలించిపోయారు. ఏం చేయాలని ఆలోచించిన ఆయన తనవంతు సాయం చేసేయాలని తీర్మానించుకున్నారు. వెంటనే తన భవిష్యనిధిలో 1998 నుంచి పొదుపైన మొత్తం రూ.8 లక్షలను రాజధాని నిర్మాణం కోసం విరాళంగా ప్రకటించారు. ఒక చిరుద్యోగి ఇంత భారీ విరాళాన్ని ప్రకటించడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హర్షం ప్రకటించారు. రమేశ్ భుజం తట్టారు.