: ఆడియోకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది: నాగచైతన్య


సోషల్ మీడియాలో నాలుగు పాటలు రెండు వారాల ముందే విడుదల చేశామని హీరో నాగచైతన్య తెలిపారు. దోచేయ్ ఆడియో వేడుకలో మాట్లాడుతూ, ఆ నాలుగు పాటలకి మంచి స్పందన వచ్చిందని చెప్పాడు. 'స్వామి రారా' సినిమాతో సుధీర్ వర్మ ఓ ట్రెండ్ క్రియేట్ చేశాడని, దోచేయ్ తో తెలుగు సినిమాల్లో మంచి ట్రెండ్ సెట్ చేస్తాడని చైతన్య విశ్వాసం వ్యక్తం చేశాడు. రచయితలు మంచి సాహిత్యం అందించారని, దానికి సన్నీ మరింత మంచి సంగీతం సమకూర్చాడని చైతూ చెప్పాడు. నిర్మాతలు తనను ఎంతో ప్రోత్సహించారని చైతన్య అన్నాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో వచ్చే పాటలు బాగుండడంతో వాటిని కూడా ఆల్బమ్ లో పెట్టామని నాగచైతన్య తెలిపాడు. దీంతో సినిమా ఆల్బమ్ లో తొమ్మిది పాటలు ఉన్నాయని చైతన్య చెప్పాడు.

  • Loading...

More Telugu News