: ఛేజింగ్ కు మొగ్గుచూపుతున్న జట్లు... రాజస్థాన్ 15/2


ఐపీఎల్ లో టాస్ గెలిచిన జట్లన్నీ ఛేజింగ్ కే మొగ్గుచూపుతున్నాయి. గత రెండు మ్యాచ్ లలో టాస్ గెలిచిన జట్లు పాటించిన సంప్రదాయాన్ని జార్జ్ బెయిలీ కొనసాగించాడు. టాస్ గెలిచిన బెయిలీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పూణే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ ఆదిలోనే స్టార్ ఆటగాడు అజింక్యా రహానే (0), సంజు శాంసన్ (5) వికెట్లను కోల్పోయింది. మూడు ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రెండు వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ, అనురీత్ సింగ్ తలో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News