: ఐపీఎల్ స్వచ్ఛతకు హామీ మాది: రాజీవ్ శుక్లా
ఐపీఎల్-8ను అవినీతి రహితంగా నిర్వహిస్తామని ఐపీఎల్ కొత్త ఛైర్మన్ రాజీవ్ శుక్లా భరోసా ఇచ్చారు. రాజస్థాన్ రాయల్స్ కి చెందిన ఆటగాడు ఫిక్సింగ్ పై బీసీసీఐకి ఫిర్యాదు చేయడంతో రేగిన కలకలంపై ఆయన స్పందించారు. అవినీతికి తావు లేకుండా ఐపీఎల్ ను నిర్వహించే బాధ్యత తనదేనని ఆయన హామీ ఇచ్చారు. ఫిక్సింగ్ పై వచ్చిన ఫిర్యాదుపై బీసీసీఐ అవినీతి నిరోధక కమిటీతో విచారణ జరిపిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ఫిర్యాదు చేసిన ఆటగాడు, ఆరోపణలు వచ్చిన ఆటగాడు ఎవరనే దానిపై ఆయన నోరుమెదపలేదు. పూర్తి వివరాలు ఐపీఎల్ గవర్నింగ్ బాడీకి ఇచ్చిన తరువాతే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.