: గవర్నర్ ను మార్చే ఆలోచన లేదు: నిర్మలా సీతారామన్
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను త్వరలో కేంద్రం మార్చబోతున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అటువంటి ఉద్దేశమే లేదని అన్నారు. గవర్నర్ ఏ విషయంలోనూ సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదని, క్యాబినెట్ నిర్ణయాలు మాత్రమే అమలు పరుస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇటీవల కాలంలో గవర్నర్ ను మార్చబోతున్నట్టు, రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించనున్నట్టు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి విదితమే.