: ప్రపంచాన్ని ఏకం చేయడంలో యునెస్కోది కీలక పాత్ర: మోదీ
ప్రపంచాన్ని ఏకం చేయడంలో యునెస్కోది కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా యునెస్కో 70వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఈ వేడుకలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఐక్యరాజ్యసమితి కారణంగానే శాంతి వర్థిల్లుతోందని తెలిపారు. ఐక్యరాజ్యసమితిలోని దేశాలన్నీ సమర్థవంతంగా సవాళ్లను ఎదుర్కొన్నాయని ఆయన పేర్కొన్నారు. మన సామూహిక లక్ష్యం ప్రశాంత, సౌభాగ్య భవిష్యత్ సాధనేనని ఆయన పునరుద్ఘాటించారు. సాంకేతిక నైపుణ్యం, విద్య, సైన్స్, అభివృద్ధి రంగాల్లో భారత్, యునెస్కో దూరదృష్టితో వ్యవహరిస్తున్నాయని ఆయన తెలిపారు. అభివృద్ధి అంటే లెక్కల్లో చూపించేది కాదని, సామాన్యుల ముఖాల్లో కనిపించే ఆనందమని ఆయన అభిప్రాయపడ్డారు.