: జోరుకు బ్రేక్... ఆగిన మార్కెట్ పరుగు


గత కొన్ని రోజులుగా వరుస లాభాలతో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ జోరుకు బ్రేక్ పడింది. కొత్తగా కొనుగోళ్ల కన్నా, లాభాల స్వీకరణకే ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వడంతో బెంచ్ మార్క్ సూచీలు దాదాపు స్థిరంగా నిలిచాయి. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ సూచీ 5.83 పాయింట్లు పడిపోయి 0.02 శాతం నష్టంతో 28879.38 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సూచీ 2.05 పాయింట్లు పెరిగి 0.02 శాతం లాభంతో 8,780.35 పాయింట్ల వద్ద కొనసాగాయి. బీఎస్ఈలో రియాల్టీ, మెటల్, ఎఫ్ఎంజీసీ తదితర సెక్టార్లు లాభాల్లో నడిచాయి. ఐడియా, ఎస్ఎస్ టీఎల్, ఎన్ఎండీసీ తదితర కంపెనీలు లాభాలను, సిప్లా, లూపిన్, హిందాల్కో తదితర కంపెనీలు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News