: మోదీ ఇంటర్వ్యూ ను ప్రచురించేందుకు ఫ్రెంచ్ వార్తా పత్రిక తిరస్కరణ
ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటర్వ్యూను ప్రచురించేందుకు ఫ్రెంచ్ వార్తాపత్రిక 'లె మోండ్' తిరస్కరించింది. ఇందుకు కారణం మోదీతో వ్యక్తిగతంగా సంభాషించకుండా, వారిచ్చిన లిఖిత పూర్వక సమాధానాలతో ఇంటర్వ్యూను ప్రచురించమనడమే కారణమట. అంతకుముందు ఆయనను కలిసి ఇంటర్వ్యూ తీసుకునేందుకు సదరు వార్తా పత్రికను అధికారులు అనుమతించలేదట. ఈ విషయాలన్ని వార్తాపత్రిక దక్షిణాసియా బ్యూరో చీఫ్ జులియన్ బౌస్సౌ ట్విట్టర్ లో తెలిపారు. "లె మోండ్ పత్రిక నరేంద్ర మోదీ ఇంటర్వ్యూను ప్రచురించేందుకు తిరస్కరించింది. ఎందుకంటే ఆయనను కలసి మాట్లాడకుండా రాసిచ్చిన సమాధానాలతో ఇంటర్వ్యూను ప్రచురించమన్నారు" అని ట్వీట్ చేశారు.