: తమిళనాడు నుంచి ఢిల్లీకి పాకాయి...ఆంధ్రాభవన్ ఎదుట ఆందోళన


తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్ కౌంటర్లపై ఆందోళనలు ఢిల్లీకి పాకాయి. కూలీలను అన్యాయంగా ఏపీ పోలీసులు పొట్టనబెట్టుకున్నారని తమిళనాడులో ప్రారంభమైన ఆందోళనలు పాండిచ్చేరికి అక్కడి నుంచి ఢిల్లీకి చేరాయి. అలాగే, తెలంగాణలో నల్గొండ-వరంగల్ జిల్లాల సరిహద్దుల్లో సంకెళ్లు వేసిన ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేశారని ఆరోపిస్తూ ఢిల్లీలోని ఆంధ్రాభవన్ ఎదుట, పలు ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. దీంతో ఆంధ్రాభవన్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News