: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం రేసులో హిల్లరీ క్లింటన్!... త్వరలోనే అధికారిక ప్రకటన


అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆ దేశాధ్యక్ష పదవికి పోటీ చేయడానికి పార్టీ అభ్యర్థిత్వం కోసం మళ్లీ పోటీపడనున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో పార్టీ నుంచి అధ్యక్ష పదవి ప్రాథమిక రేసుకు ఆమె తన నామినేషన్ దాఖలు చేసే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తారని మీడియా సమాచారం. అధ్యక్ష ఎన్నికకు పోటీ చేయాలంటే అంతకంటేముందుగా తమ డెమోక్రాటిక్ పార్టీలో జరిగే పోటీలో గెలవాలి. ఇందులో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే పోటీ చేసేందుకు అర్హులవుతారు. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాపై 2008లో డెమోక్రాటిక్ అధ్యక్ష పదవి ప్రాధమిక రేసులో హిల్లరీ ఓడిపోయారు. దాంతో రెండవసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. "తన రాజకీయ లక్ష్యాలపై వస్తున్న ఊహాగానాలకు హిల్లరీ క్లింటన్ త్వరలో ముగింపు చెబుతారు. అంతేకాదు అధ్యక్ష పదవికి తాను పోటీలో ఉన్నట్టు ఈ వారాంతంలో అధికారికంగా ప్రకటించవచ్చు" అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకోసం ఓ కార్యాలయాన్ని క్లింటన్ టీమ్ బ్రూక్లిన్ లో అద్దెకు తీసుకుందని కూడా సమాచారం. అయితే అధికారికంగా మాత్రం ధ్రువీకరణకాలేదు.

  • Loading...

More Telugu News