: వీహెచ్ పీ భజనల గోల తట్టుకోలేక ఇల్లు అమ్ముకున్న వ్యాపారవేత్త


హిందువులు అధికంగా ఉన్న ప్రాంతంలో ఒక ముస్లిం వ్యాపారవేత్త భవనాన్ని కొనుగోలు చేయగా, అతడిని ఎలాగైనా ఖాళీ చేయించాలని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వినూత్న నిరసన చేపట్టగా, చివరికి ఆ ఇల్లు అమ్ముకొని వెళ్లిపోయడా వ్యాపారి. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. భావ్ నగర్ పరిధిలో హిందూ కుటుంబాలు అధికంగా ఉన్న చోట ఒక ముస్లిం వ్యాపారి లక్షల రూపాయలు వెచ్చించి భవనాన్ని కొనుగోలు చేశాడు. దీన్ని వ్యతిరేకించిన స్థానికులు నిత్యమూ అతని ఇంటిముందు రామ భజనల కార్యక్రమాలు నిర్వహిస్తూ లౌడ్ స్పీకర్లతో మనశ్శాంతి లేకుండా చేయడం మొదలుపెట్టారు. ఈ గోల తట్టుకోలేక ఆయన ఇల్లు అమ్ముకొని వెళ్ళాల్సి వచ్చింది. గత కొంతకాలంగా హిందూ ప్రాంతాల్లో ముస్లింలు ఆస్తులను కొనుగోలు చేస్తున్నారని, దీన్ని అడ్డుకోవడానికి ప్రవీణ్ తొగాడియ ఇచ్చిన పిలుపు మేరకు ఇలా చేశామని వీహెచ్ పీ నేత ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News