: పోలీసులపై కూలీలు రాళ్లు రువ్వారు, గొడ్డళ్లతో దాడి చేశారు: నివేదికలో హైకోర్టుకు ఏపీ డీజీపీ


ఎర్రచందనం దుంగల కోసం శేషాచలం అడవుల్లోకి వచ్చిన తమిళ కూలీలు అమాయకులేమీ కాదని, కరుడుగట్టిన స్మగ్లర్లని ఏపీ డీజీపీ రాముడు అన్నారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ను నిలువరించేందుకు యత్నించిన పోలీసులపై తమిళ కూలీలు రాళ్లు రువ్వడమే కాక గొడ్డళ్లతో దాడికి దిగారని ఆయన ఆ నివేదికలో తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆయన కోర్టుకు తెలిపారు. ఆత్మరక్షణలో భాగంగానే తమ సిబ్బంది స్మగ్లర్లపై కాల్పులు జరిపారని డీజీపీ తెలిపారు.

  • Loading...

More Telugu News