: తమిళనాడులో నాలుగోరోజు కొనసాగుతున్న ఆందోళనలు


శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్ కు నిరసనగా తమిళనాడులో నాలుగవ రోజు నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తిరువత్తియూర్ లో ఆంధ్రాబ్యాంకుకు చెందిన ఏటీఎంను ధ్వంసం చేశారు. వెంటనే పోలీసులు ఏటీఎంపై దాడిచేసిన ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమిళనాడులో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే, చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడిస్తామని ఎండీఎంకే అధినేత వైగో హెచ్చరించారు. ఇందుకు తమిళనాడు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అటు వైగోను చిత్తూరు జిల్లా సరిహద్దులోనే అడ్డుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.

  • Loading...

More Telugu News