: భూసేకరణ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్... విచారణకు స్వీకరించిన కోర్టు
నరేంద్ర మోదీ సర్కారును ముప్పుతిప్పలు పెడుతున్న భూ సేకరణ ఆర్డినెన్స్ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం గడప తొక్కింది. రైతుల పాలిట శాపంగా మారనున్న ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో నిన్న ఓ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. యూపీఏ హయాంలో రూపొందిన భూసేకరణ బిల్లుకు సవరణలు చేసిన మోదీ సర్కారు పార్లమెంట్ ఆమోదం కంటే ముందుగానే ఆర్డినెన్స్ ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.