: శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్, పలువురు సినీ ప్రముఖులు


తిరుమల శ్రీవారిని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు వచ్చిన ఆమెకు, కుటుంబ సభ్యులకు టీటీడీ ఈవో సాంబశివరావు, అధికారులు స్వాగతం పలికారు. తరువాత స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్పీకర్ కు ఆలయ పండితులు ఆశీర్వచనం ఇచ్చి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. అప్పుడే శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. మరోవైపు సినీ నటి శ్రుతి హసన్, నిర్మాతలు బండ్ల గణేష్, ఎన్వీ ప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. వారు కూడా ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

  • Loading...

More Telugu News