: చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ కార్మికుల మెరుపు సమ్మె... తిరుమలకు నిలిచిన బస్సులు


తిరుమల వెంకన్న దర్శనం కోసం తిరుపతి చేరుకున్న భక్తులు నేటి తెల్లవారుజాము 3 గంటల నుంచి తిరుపతి బస్టాండ్లలోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఎందుకంటే, తెల్లవారుజాము 3 గంటల నుంచి తిరుమలకు ఒక్క బస్సు బయలుదేరలేదు. తిరుపతి రీజనల్ మేనేజర్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్ఎంయూ మెరుపు సమ్మెకు పిలుపునిచ్చింది. ఎన్ఎంయూ పిలుపు మేరకు జిల్లాలోని మెజారిటీ కార్మికులు విధులు బహిష్కరించారు. దీంతో జిల్లాలో మొత్తం 1,500 బస్సులుండగా, వాటిలో 850 బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. కార్మికుల మెరుపు సమ్మె కారణంగా జిల్లావ్యాప్తంగా ప్రయాణికులు బస్టాండ్లలోనే చిక్కుకుపోయారు. మహిళా కండక్టర్లపై వేధింపులకు దిగుతున్న వారిపై చర్యల విషయంలో ఆర్ఎం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ కార్మికులు సమ్మెకు దిగారు.

  • Loading...

More Telugu News