: చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడిస్తామంటున్న వైగో... అప్రమత్తమైన పోలీసులు


శేషాచలం ఎన్ కౌంటర్ ను నిరసిస్తూ చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ను ముట్టడిస్తామని తమిళ పార్టీ ఎండీఎంకే నేత వైగో చేసిన ప్రకటన ఇటు ఏపీ పోలీసులనే కాక, అటు తమిళనాడు పోలీసులను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. వైగో ప్రకటన నేపథ్యంలో చిత్తూరు, వేలూరు జిల్లాల సరిహద్దులో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. బూటకపు ఎన్ కౌంటర్ లో తమిళనాడుకు చెందిన 20 మంది కూలీలను ఏపీ పోలీసులు పొట్టనబెట్టుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాలోనూ నిరసన ప్రదర్శనకు దిగనున్నామని, 2 వేల మందితో చిత్తూరు కలెక్టరేట్ ను ముట్టడిస్తామని వైగో ప్రకటించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

  • Loading...

More Telugu News