: తెలుగు జాతిలో పుట్టడం నా అదృష్టం: బాలకృష్ణ


తెలుగు జాతిలో పుట్టడం తన అదృష్టమని నందమూరి బాలకృష్ణ భావోద్వేగంతో అన్నారు. లయన్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తాను కేవలం తన తండ్రి సినిమాలే చూస్తానని, తన తండ్రి నటించిన సినిమాల్లోని పాటలే వింటానని అన్నారు. అవి వింటే తనకు ఎంతో సాంత్వన లభిస్తుందని ఆయన చెప్పారు. ఎన్టీఆర్ తెలుగు వ్యక్తిగా పుట్టడం మీ అదృష్టమని బాలయ్య తెలిపారు. ఎంతో దూరం నుంచి వచ్చిన అభిమానులు క్షేమంగా వెళ్లాలని ఆయన సూచించారు. తనను ఎప్పట్లానే అభిమానులు ఆదరించాలని ఆయన కోరారు. ఆడియో వేడుకలో సినిమాలోని డైలాగులు చెప్పి అభిమానులను అలరించారు. అలాంటి డైలాగులు సినిమాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయని బాలయ్య తెలిపారు. ఆడియో వేడుకను స్వచ్ఛమైన తెలుగు పాటతో ముగించి తన ప్రత్యేకతను చాటుకున్నారు.

  • Loading...

More Telugu News