: కాలసర్పదోషం ఉంది...అంతా జాగ్రత్తగా ఉండండి: బాలయ్య
ఈ ఏడాది కాలసర్పదోషం ఉందని బాలయ్య తెలిపారు. లయన్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, కాలసర్పదోషం ప్రభావం మూడు రంగాలపై ఉంటుందని అన్నారు. రాజకీయ, సినీ, వ్యాపార రంగాలపై దీని దుష్ప్రభావం ఉంటుందని, రాష్ట్ర ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు భాషలో అద్భుతమైన సౌందర్యం ఉందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఒకే అక్షరంతో ఉన్న రెండు చమక్కులు విసిరారు. తన సినిమాల్లోని డైలాగులు అభిమానులు చెబుతుంటే, తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని ఆయన తెలిపారు. తన తండ్రి తనకిచ్చిన వారసత్వాన్ని సినీ, రాజకీయరంగాల్లో కొనసాగిస్తున్నానని అన్నారు. తెలుగు జాతి తన దేహం అని, హిందూపురం అంటే తనకు ప్రాణసమానమని ఆయన చెప్పారు. మన రాష్ట్రాలు విడిపోయినా, మనం విడిపోకూడదని ఆయన ఆకాంక్షించారు. ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి అంతా ముఖ్యమంత్రితో నడవాలని ఆయన సూచించారు. కాలంతోపాటు నేను పరుగుతీయను, కాలం నాతోపాటు పరుగుతీసిందంటూ ఆయన ఓ ఛలోక్తి విసిరారు.