: అంతా స్క్రీన్ మీదే హీరోలు...స్క్రీన్ బయట కూడా హీరో బాలయ్య!: దర్శకుడు సత్యదేవా
తెలుగు సినీ చరిత్రలో అంతా స్క్రీన్ పై హీరోలని, కానీ బాలయ్యబాబు మాత్రం స్క్రీన్ బయట కూడా హీరో అని 'లయన్' దర్శకుడు సత్యదేవా తెలిపాడు. 'లయన్' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, పిల్లి, కుందేలు, ఇతరమైన వాటితో సావాసం చేస్తే ఒకలా ఉంటుంది, కానీ 'లయన్'తో సావాసం చేస్తే వచ్చే కిక్కే వేరని అన్నారు. తాను దానిని అనుభవించానని ఆయన చెప్పారు. సినిమా క్రెడిట్ అంతా బాలయ్యబాబుకే దక్కుతుందని ఆయన వెల్లడించారు. సినిమా అవకాశం ఇచ్చిన బాలయ్యబాబుకి ధన్యవాదాలని ఆయన చెప్పారు. ఆయన గత సినిమాలకు ఇది సరితూగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. మంచి బాణీలు ఇచ్చిన మణిశర్మకు ధన్యవాదాలు తెలిపారు. సినిమాలో పనిచేసిన అందరికీ ధన్యవాదాలని ఆయన చెప్పారు.