: శేషాచలం మృతుల అంత్యక్రియలు ఆపండి: మద్రాస్ హైకోర్టు


శేషాచలం అడవుల్లో ఎన్ కౌంటర్ లో మృతి చెందిన ఎర్రచందనం దొంగల మృతదేహాలకు శుక్రవారం వరకు అంత్య క్రియలు జరపొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆరుగురి మృతదేహాలకు రేపటి వరకు అంత్యక్రియలు జరగకుండా ఆగిపోనున్నాయి. పోలీసు కాల్పుల్లో తన భర్త మృతి చెందడంపై అనుమానాలు ఉన్నాయని, వాస్తవాలు వెలికి తీసేందుకు మరోసారి పోస్టు మార్టం నిర్వహించాలని ఓ బాధితురాలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఆమె పిటిషన్ పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, ఎన్ కౌంటర్ లో మృతి చెందిన కూలీలకు మరోసారి పోస్టుమార్టం నిర్వహించి, వాస్తవాలు బాధితులకు తెలియజేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

  • Loading...

More Telugu News