: చర్లపల్లి జైలుకి సత్యం దోషులు


ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి, తప్పుడు లెక్కలతో సంస్థను నిర్వహించిన సత్యం దోషులను పోలీసులు హైదరాబాదులోని చర్లపల్లి జైలుకు తరలించారు. సత్యం కుభకోణంలో పది మంది దోషులకి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పటి సత్యం చైర్మన్ బైర్రాజు రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా మిగిలిన ఎనిమిది మందిని న్యాయస్థానం నుంచి నేరుగా జైలుకు తరలించారు. 33 నెలలు రిమాండ్ ఖైదీగా జైలు శిక్ష అనుభవించిన రామలింగరాజు మినహా మిగిలిన వారు పూర్తి శిక్ష అనుభవించనున్నారు. కాగా, వీరు బెయిల్ పిటిషన్ హైకోర్టులో వేసుకోవచ్చని కోర్టు సూచించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News