: నా దృష్టిలో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అతనే!: గంభీర్
ఐపీఎల్ సీజన్ 8 తొలి మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మోర్నీ మోర్కెల్ నిలవగా, తనకు మాత్రం మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ అని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీర్ అన్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబై ఇండియన్స్ తలపడిన మ్యాచ్ ను మలుపుతిప్పిన ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్, కీలక సమయంలో రంగప్రవేశం చేసి, సిక్సుల మీద సిక్సులు బాది మ్యాచ్ ను ఒంటి చేత్తో మలుపుతిప్పిన సంగతి తెలిసిందే. అందుకే, తన దృష్టిలో సూర్యకుమారే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అని గంభీర్ అభిప్రాయపడ్డాడు.