: మాకొద్దు బాబోయ్ విమానాశ్రయం:భోగాపురం వాసులు
అంతర్జాతీయ విమానాశ్రయం వస్తే, ఉపాధి అవకాశాలు, భూముల విలువ? ఇతర సౌకర్యాలు పెరుగుతాయి. దీంతో జీవనప్రమాణాలు మెరుగవుతాయని అంతా భావిస్తారు. కానీ భోగాపురం వాసులు మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. తమ భూములు లాక్కుని, నిరాశ్రయులను చేస్తూ, లభించే అభివృద్ధి తమకొద్దని నినదించేందుకు సిద్ధమవుతున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని ప్రకటించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు విమానాశ్రయం ఏర్పాటు చేస్తామంటున్న ప్రాంతంలోని ఏరావివలసలో స్థానిక అఖిలపక్షం నేతలు సమావేశం నిర్వహించారు. మండలంలోని ప్రజలంతా దీనిని కలసికట్టుగా అడ్డుకోవాలని తీర్మానించారు. శుక్రవారం పదివేల మందితో జాతీయ రహదారిని దిగ్బంధించి, అనంతరం తహసీల్దారు కార్యాలయం ముందు ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.