: హెరిటేజ్ పై చెన్నైలో తమిళుల దాడి.. కొనసాగుతున్న నిరసనలు


చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ కు నిరసనగా తమిళనాడులో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ పోలీసులు రెండు రోజుల క్రితం జరిపిన ఈ ఎన్ కౌంటర్ లో 20 మంది ఎర్రచందనం కూలీలు మరణించారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారే. దీనిపై సమాచారం అందుకున్న తమిళ సంఘాలు మూడు రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై దాడులకు దిగడమే కాక చెన్నైలోని ఏపీకి చెందిన పలు సంస్థలపై దాడులకు యత్నించాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా చెన్నై-ఏపీ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా కొద్దిసేపటి క్రితం చెన్నైలోని హెరిటేజ్ ఫుడ్స్ కార్యాలయంపై తమిళులు దాడి చేశారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబ ఆధ్వర్యంలో హెరిటేజ్ ఫుడ్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అవగాహన ఉన్న తమిళ సంఘాలే ఈ దాడికి దిగాయని పోలీసులు భావిస్తున్నారు. తమిళుల దాడిలో హెరిటేజ్ ఫుడ్స్ కార్యాలయానికి ఎంతమేర నష్టం వాటిల్లిందన్న విషయం తెలియరాలేదు.

  • Loading...

More Telugu News