: సత్యం కేసులో మా పాత్రేమీ లేదు... పైకోర్టుకెళతామన్న ఆడిటింగ్ సంస్థ


సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో తమ పాత్రేమీ లేదని అంతర్జాతీయ ఆడిట్ సంస్థ ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ వెల్లడించింది. ఈ కేసులో కొద్దిసేపటి క్రితం నాంపల్లి సీబీఐ కోర్టు వెలువరించిన తీర్పులో ఆ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులు కూడా దోషులుగా తేలారు. కోర్టు తీర్పుపై వెనువెంటనే స్పందించిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, పైస్థాయి కోర్టును ఆశ్రయించనున్నట్లు వెల్లడించింది. కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆ సంస్థ, కుంభకోణంలో తమ సంస్థ సిబ్బంది ప్రమేయం లేకున్నా కోర్టు దోషులుగా తేల్చడం తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపింది.

  • Loading...

More Telugu News