: మీరు హిందీ నేర్చుకోండి... మేము జర్మనీ నేర్చుకుంటాం: స్మృతీ ఇరానీ


దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ లో థర్డ్ లాంగ్వేజ్ గా ఉన్న జర్మనీని తొలగించాలని గత సంవత్సరం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావడంతో కేంద్ర మనవ వనరుల మంత్రిత్వ శాఖ ఒక మెట్టు దిగివచ్చింది. క్విడ్ ప్రోకో పద్ధతిలో ముందుకు సాగుదామని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఒక ఆఫర్ ను జర్మనీ ముందుంచారు. మా స్కూల్స్ లో జర్మన్ కొనసాగాలంటే, మీ పిల్లలకు హిందీ నేర్పాలని ఆమె సూచించారు. హిందీ కష్టమని భావిస్తే, మరో భారతీయ భాషను ఎంచుకోవాలని తెలిపారు. ఈ మేరకు ఒక ఒప్పంద ప్రతిపాదనా పత్రాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సిద్ధం చేసింది. ఇండియాలో ఎన్ని స్కూల్స్ లో జర్మన్ భాషను నేర్పుతారో, అంతే సంఖ్యలో జర్మనీలోని స్కూల్స్ లో హిందీ లేదా మరో భారతీయ భాషను ప్రవేశపెట్టాలన్నది ఈ ఒప్పంద సారాంశం. ఈ నెలలో ప్రధాని జర్మనీలో పర్యటించనున్న నేపథ్యంలో సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News