: తీహార్ జైలులో ఖైదీ గ్యాంగ్‌ ల మధ్య ఘర్షణ... ఒకరి మృతి


ఢిల్లీలో అత్యంత కట్టుదిట్టమైన తీహార్ జైలులో రెండు వర్గాలకు చెందిన ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఒక ఖైదీ మృతి చెందాడు. నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పాత గొడవల నేపథ్యంలో ఖైదీల మధ్య దాడులు జరుగగా, ఐదుగురు ఖైదీలు రవీంద్ర అనే సహచర ఖైదీపై విరుచుకుపడ్డారు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్టు తీహార్ జైలు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు గల అసలు కారణమేంటో తెలియదని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు. రవీంద్ర మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News