: శేషాచలం ఎన్ కౌంటర్ పై తమిళ సీఎం ఉన్నత స్థాయి సమీక్ష... విచారణ చేపట్టనున్న ఐజీ మంజునాథ్


చిత్తూరు జిల్లా పరిధిలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై తమిళనాడు ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తోంది. తమిళనాడు పోలీసు శాఖలో ఐజీగా పనిచేస్తున్న సీనియర్ పోలీసు అధికారి మంజునాధ్ ఆధ్వర్యంలో సమగ్ర విచారణ చేపట్టాలని తమిళ సర్కారు నిర్ణయించింది. ఇదిలా ఉంటే, శేషాచలం ఘటనపై నేడు సీఎం పన్నీర్ సెల్వం ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్ కౌంటర్ ఘటనను సమర్థించుకునేలా ఏపీ సర్కారు చేస్తున్న వాదనపై ఎలా స్పందించాలన్న విషయంపై సెల్వం నేటి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. 20 మంది కూలీలను ఏపీ పోలీసులు మట్టుబెట్టిన తీరుపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న తమిళ సర్కారు ఉన్నత స్థాయి సమావేశంపై ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News