: భారత సంతతి 'బందిపోటు బాంబు'కు 66 నెలల జైలు శిక్ష
'బందిపోటు బాంబు' అని పేరున్న సందీప్ కౌర్ అనే భారతీయ మహిళకు అమెరికాలోని కాలిఫోర్నియా న్యాయస్థానం 66 నెలల జైలు శిక్ష విధించింది. నాలుగు బ్యాంకులను దోచుకున్నట్టు ఆమెపై ఆరోపణలున్నాయి. ఆమె తరఫున వాదించిన న్యాయవాది ఆమె సత్ప్రవర్తన గురించి పూసగుచ్చినట్టు వివరించినా న్యాయస్థానం పట్టించుకోలేదు. కౌర్ వయసు తక్కువని, బాగా చదువుకుందని, సంప్రదాయ భారతీయ కుటుంబం నుంచి వచ్చిందని, పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదని, బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చేసిందని, పెళ్లి మూణ్ణాళ్ల ముచ్చటగా మారడంతో, స్టాక్ మార్కెట్లో కొంత సంపాదించాక, లాస్ వెగాస్ లో జూదానికి అలవాటుపడి, అప్పుల్లో కూరుకుపోయిందని, జైల్లో ఉన్నప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనతో గడిపిందని లాయర్ చెప్పారు. దానిని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోలేదు. ఆమె బ్యాంకులను దోపిడీ చేస్తున్న సమయంలో బాంబులతో పేల్చేస్తానని చెప్పడంతో ఆమెకు 'బందిపోటు బాంబు' అని పేరు వచ్చిందని ఎఫ్ బీ వర్గాలు తెలిపాయి.