: తారక్, మహేష్, ప్రభాస్ లకు గౌరవమిస్తాను: అల్లు అర్జున్


సమకాలీన హీరోలంటే చాలా గౌరవమని యువ హీరో అల్లు అర్జున్ తెలిపాడు. సన్నాఫ్ సత్యమూర్తి విడుదల కానున్న సందర్భంగా మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, తన సహచర హీరోలంటే తనకు అపారమైన గౌరవమని, వారిని కించపరుస్తూ ఎక్కడా మాట్లాడనని, అలాగే తన ఎదురుగా ఎవరైనా వారిని కించపరిస్తే ఊరుకోనని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లు ఈ స్థాయికి చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారని, వాళ్లను చూసి ఎవరైనా స్పూర్తి పొందాల్సిందేనని, అలాంటి వారి గురించి ఎవరైనా అవాకులు చవాకులు పేలితే, వారిని తాను ప్రోత్సహించనని అల్లు అర్జున్ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News