: కళకళలాడుతున్న ఈడెన్ గార్డెన్స్... మరికాసేపట్లో ఐపీఎల్-8 తొలి పోటీ


మండే ఎండల మధ్య క్రీడాభిమానులకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించేందుకు ఐపీఎల్-8 సిద్ధమైంది. మరో మూడు గంటల్లో జరగనున్న తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుండగా, ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియం వద్ద అభిమానుల రాక మొదలైంది. ఈ మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూసేందుకు టిక్కెట్లు కొనుగోలు చేసిన అభిమానులు స్టేడియంలోనికి ప్రవేశించేందుకు వేచి చూస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అభిమానుల సందడితో కళకళలాడుతోంది. కోల్ కతా, ముంబై జట్లతో పాటు చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు పోటీలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News