: అశోక్ గజపతిరాజును బర్తరఫ్ చేయాలి : పొంగులేటి
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. విమానంలో అగ్గిపెట్టె తీసుకెళ్తే తప్పేంటి? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పొంగులేటి ప్రధానికి లేఖ రాశారు. బాధ్యతాయుత పదవిలో వుండి, బాధ్యతారహిత వ్యాఖ్యలు చేసిన మంత్రిని క్షమించరాదని లేఖలో సూచించారు. ఆయన వ్యాఖ్యలు ఇతరులను ప్రభావితం చేసేలా ఉన్నాయని, వాటి కారణంగా అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, తన వ్యాఖ్యలు భద్రతను మరింత పటిష్టం చేయాలని పేర్కొంటూ చేసినవే తప్ప, వివాదం రేపేందుకు కాదని కేంద్ర మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.