: ఎటువంటి డ్రెస్ నప్పుతుందో చెప్పే యాప్...'రీమిక్స్'


స్మార్ట్ ఫోన్ యాప్ సేవలందిస్తున్న పాలీవోర్ తాజాగా 'రీమిక్స్' పేరిట సరికొత్త యాప్ విడుదల చేసింది. దీన్ని వాడి యూజర్లు తమకు ఎటువంటి దుస్తులు నప్పుతాయి, మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతున్న వెరైటీ లేంటి? తదితరాలను తెలుసుకోవచ్చని పాలీవోర్ తెలిపింది. ఈ యాప్ లో ట్రెండింగ్, ఫైండ్, మై ఫేవ్స్ పేరిట కేవలం 3 సెక్షన్ లు మాత్రమే ఉంటాయని వివరించింది. ట్రెండింగ్ పేజిలో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ చూసుకోవచ్చని, నిత్యమూ మారుతుండే డిజైన్ స్టైల్స్ కు అనుగుణంగా దుస్తులను ఎంచుకోవచ్చని తెలిపింది. ఫైండ్ సెక్షన్ లో నచ్చిన దుస్తులు సమీపంలో ఎక్కడ లభిస్తాయో తెలుసుకోవచ్చని పేర్కొంది. నచ్చిన డిజైన్లను మై ఫేవ్స్ లో సేవ్ చేసుకోవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News