: మీడియాపై మంత్రి వీకే సింగ్ అనుచిత వ్యాఖ్యలు... తమకు సంబంధం లేదన్న కేంద్రం, బీజేపీ
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి జనరల్ వీకే సింగ్ ఈ మధ్య తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 'pressttitutes'కు 'prostitutes'కు తేడా ఏంటి? కేవలం 'O' స్థానంలో 'E' తప్ప అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలను పలు రాజకీయపార్టీలు, బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్, మీడియా ప్రతినిధులు ఖండించారు. మంత్రి స్థానంలో ఉండి ఇటువంటి నిర్లక్ష్యపు వ్యాఖ్యలు చేసిన వీకే సింగ్ పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యలు తీసుకోగలరా? అంటూ కాంగ్రెస్ ప్రశ్నించింది. ఈ క్రమంలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ మంత్రి వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తెలిపాయి. ఆ మాటలు మంత్రి వ్యక్తిగతమని సమాధానమిచ్చాయి.