: అభిమానులకు అల్లు అర్జున్ పుట్టినరోజు కానుక
నేడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులకు ఓ బహుమతి ఇచ్చాడు. ఫాన్స్ కు మరింత దగ్గర అయ్యేందుకు ట్విట్టర్ లో ఖాతాను తెరిచాడు. ఉదయం సరిగ్గా 8 గంటలకు తన ట్విట్టర్ అకౌంట్ ను యాక్టివేట్ చేశాడు. గతంలో యువర్స్ ట్రూలీ బన్నీ అనే పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఉన్నా, అది తన అసలైన అకౌంట్ కాదని అల్లు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాను యాక్టివేట్ చేసిన ఖాతాలో అర్జున్ ఇంతవరకూ ఎటువంటి పోస్ట్ చేయలేదు. అయితేనేం ఆయనను ఫాలో అవుతామంటూ గంటన్నరలో 3,300 మంది చేరిపోయారు.