: కర్నూలు టూ నల్గొండ.. వయా పాలమూరు జిల్లా... సిద్ధయ్య ప్రస్థానం!


నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఉగ్రవాదుల ఎన్ కౌంటర్ సందర్భంగా టెర్రరిస్టుల తూటాలు తగిలి మృత్యువుతో పోరాడి ఓడిన ఎస్సై సిద్ధయ్య ప్రస్థానం ఆసక్తికరం. నల్గొండ జిల్లా పోలీసు శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న సిద్ధయ్య... సూర్యాపేట షూటర్స్ ను వెంటాడి, వేటాడారు. అయితే మాటువేసి దొంగదెబ్బ తీసిన ఉగ్రవాదులు సిద్ధయ్య శరీరంలో నాలుగు బుల్లెట్లను దించారు. దీంతో రక్తపు మడుగులో పడిపోయిన సిద్ధయ్య మృత్యువును తప్పించుకునేందుకు తీవ్ర యత్నం చేశారు. ఈ క్రమంలో తనకు బతకాలని ఉందని, తనను బతికించండని సహచర పోలీసులను ఆయన వేడుకున్న తీరు తెలుగు ప్రజలను కంటతడి పెట్టించింది. బుల్లెట్ గాయాలతో కోలులోలేక నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచిన సిద్ధయ్య ప్రస్థానం రెండు రాష్ట్రాల్లో, మూడు జిల్లాల్లో సాగింది. ప్రస్తుతం ఏపీలోని రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలోని చాగలమర్రికి చెందిన సిద్ధయ్య కుటుంబం గతంలోనే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో స్థిరపడింది. తర్వాత ఎస్సైగా ఎంపిక అయిన సిద్ధయ్య, నల్గొండ జిల్లాలో ఎస్సైగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. పోలీసు శిక్షణను విజయవంతంగా ముగించుకున్న సిద్ధయ్య, విధి నిర్వహణలో చురుగ్గా వ్యవహరించడమే కాక సహచర పోలీసులకు, కింది స్థాయి సిబ్బందికి ఇష్టమైన పోలీసు బాసుగా అనతికాలంలోనే పేరు తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News