: మాజీ మంత్రి రాంభూపాల్ చౌదరి కన్నుమూత


మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాంభూపాల్ చౌదరి మరణించారు. కర్నూలు జిల్లాకు చెందిన రాంభూపాల్ చౌదరి అనారోగ్య కారణాలతో గత కొంతకాలం నుంచి హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ, కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా చౌదరి పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని పలుమార్లు బహిరంగంగానే పార్టీ అధినాయకత్వంపై తన అసంతృప్తి వ్యక్తం చేసి ఆయన వార్తల్లోకెక్కారు.

  • Loading...

More Telugu News