: చెన్నై, పంజాబ్ బలంగా కనబడుతున్నాయి: గంగూలీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-8లో చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్లు బలంగా కనబడుతున్నాయని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ సభ్యుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు కూడా టైటిల్ రేసులో నిలబడతాయని గంగూలీ చెప్పాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టును అండర్ డాగ్స్ గా భావించవచ్చని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇతర జట్లు ఉత్తమ ప్రదర్శన చేస్తే, టైటిల్ సాధించడం కష్టం కాదని దాదా వెల్లడించాడు. ఐపీఎల్ లో పాల్గొంటున్న జట్లన్నీ సమతూకం పాటిస్తున్నాయని, అందుకే విజేత ఎవరు? అనేది ముందుగా అంచనా వేయలేకపోతున్నామని గంగూలీ అభిప్రాయపడ్డాడు.