: ఐపీఎల్ ప్రారంభ వేడుకకు చెక్ చెప్పిన వర్షం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-8 ప్రారంభవేడుకలకు వర్షం చెక్ చెప్పింది. పశ్చిమ బెంగాల్ లోని సాల్ట్ లేక్ స్టేడియం ప్రారంభ వేడుకలకు రంగురంగుల విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. కాసేపట్లో ఆరంభ వేడుక అట్టహాసంగా ప్రారంభం కానుందనగా, వర్షం ఆరంభమైంది. దీంతో ఐపీఎల్ ప్రారంభవేడుకలు జరుగుతాయా? అనే అనుమానం నెలకొంది. వర్షం తగ్గితే కానీ వేడుకలు జరిగే అవకాశం లేదు. కాగా, ఆరంభవేడుకలు వీక్షించేందుకు అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియానికి పోటెత్తారు. క్రికెటర్లు, బాలీవుడ్ తారలు ప్రారంభవేడుకలు చూసేందుకు పెద్దఎత్తున తరలి వచ్చారు. కాగా, ఈ వేడుకలో హృతిక్ రోషన్, షాహిద్ కపూర్, ఫర్హాన్ అఖ్తర్, అనుష్కా శర్మ ప్రదర్శన ఇవ్వనున్న సంగతి తెలిసిందే.