: కీలక నిర్ణయాలతో ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నల్గొండ జిల్లాలో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో కేబినెట్ లో తీవ్ర చర్చరేగింది. ఈ సందర్భంగా తక్షణం పోలీస్ శాఖను పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పోలీస్ రిక్రూట్ మెంట్ చేపట్టాలని నిర్ణయించారు. అలాగే నల్గొండ జిల్లా ఘటనలో మృతి చెందిన వీరుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 40 లక్షల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. తెలంగాణా దినోత్సవ వేడుకలకు 20 కోట్ల రూపాయలు విడుదల చేశారు.