: మూడు వారాలుగా జైల్లో పాకిస్థాన్ సూపర్ మోడల్
పాకిస్థాన్ సూపర్ మోడల్ ఆయన్ అలీ (23) గత మూడు వారాలుగా ఇస్లామాబాద్ లోని జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తోంది. మార్చి 14న ఇస్లామాబాద్ విమానాశ్రయంలో మనీలాండరింగ్ కేసులో కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఐదు లక్షల డాలర్లు తన వెంట తీసుకెళ్తూ ఆమె పోలీసులకు పట్టుబడ్డారు. కాగా, కేవలం 10 వేల డాలర్లు తీసుకెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంది. అలీకి కస్టమ్స్ రూల్స్ పై అవగాహన లేని కారణంగా ఈ తప్పు జరిగిందని ఆమె తరపు న్యాయవాది కోర్టుకు తెలిపాడు. అయినప్పటికీ న్యాయస్థానం ఆమెకు బెయిల్ ఇవ్వకపోవడం విశేషం. కాగా, 16వ ఏట మోడలింగ్ రంగంలో అడుగుపెట్టిన ఆయన్ అలీ, ఆనతికాలంలోనే సూపర్ మోడల్ గా ఎదిగింది. కాగా, జైలులో ఆమె వీవీఐపీ ట్రీట్ మెంట్ పొందుతోందని మీడియా తెలుపగా, అలాంటిదేమీ లేదని జైలు సిబ్బంది చెబుతున్నారు.